Punjab Shocker: పంజాబ్‌లో దారుణం, విద్యార్థిని కారుతో ఢీకొట్టి బానెట్‌పై 10 కిలోమీటర్లు వేలాడుతూ తీసుకువెళ్లిన టీచర్, వీడియో ఇదిగో

పంజాబ్‌లోని కపుర్తలా జిల్లాలో ఓ విద్యార్థి పట్ల టీచర్‌ దారుణంగా ప్రవర్తించాడు. వ్యక్తిగత శత్రుత్వం కారణంగా అతడ్ని కారుతో ఢీకొట్టాడు. కారు బానెట్‌పై పడి ప్రమాదకరంగా వేలాడిన అతడ్ని పది కిలోమీటర్ల దూరం వరకు అలా తీసుకెళ్లాడు. (Teacher Hits Student Tosses Him On Car Bonnet) ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

teacher hitting a boy with his car and dragging him for around 10 kilometers on the car's bonnet

ప్రైవేట్‌ కోచింట్‌ సెంటర్‌లో ఐఈఎల్‌టీఎస్‌కు శిక్షణ పొందుతున్న హర్మన్‌ప్రీత్ సింగ్‌ ఈ నెల 26న సుల్తాన్‌పూర్ ప్రాంతంలోని రోడ్డుపై నిల్చొని ఉన్నాడు. టీచర్‌ బల్జీందర్ సింగ్ ఆ విద్యార్థి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు. కారును వేగంగా నడిపి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ఢీకొట్టాడు. కారు బానెట్‌పై పడి ప్రమాదకరంగా వేలాడిన విద్యార్థిని పది కిలోమీటర్ల దూరం వరకు డ్రైవ్‌ చేశాడు. ఈ నేపథ్యంలో విద్యార్థి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ గాయపడ్డాడు.ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

teacher hitting a boy with his car and dragging him for around 10 kilometers on the car's bonnet

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now