Video: గుండెను హత్తుకునే వీడియో ఇదిగో, సైనికుడికి రెడ్ కార్పెట్‌తో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అంటూ ముగ్గులు

దేశంలో సైన్యంలో ఎక్కువగా సేవలు అందిస్తున్నది పంజాబీ నుంచే అని చెప్పవచ్చు. సైన్యంలోనూ పంజాబీలకు ప్రత్యేకంగా ఓ రెజిమెంట్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి కుటుంబ సభ్యులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు.

punjabi-family-welcomes-young-soldier-with-red-carpet Watch Viral Video

దేశంలో సైన్యంలో ఎక్కువగా సేవలు అందిస్తున్నది పంజాబీ నుంచే అని చెప్పవచ్చు. సైన్యంలోనూ పంజాబీలకు ప్రత్యేకంగా ఓ రెజిమెంట్ ఉంది. తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. సైన్యంలో పనిచేస్తున్న యువకుడికి కుటుంబ సభ్యులు రెడ్ కార్పెట్ స్వాగతం పలకడాన్ని ఆ వీడియోలో చూడొచ్చు. గ్రామంలో వ్యవసాయ క్షేత్రాలకు సమీపంలో ఉన్న తమ ఇంటి వద్ద కారులో దిగిన ఆ యువ జవాను... రెడ్ కార్పెట్ పై కవాతు చేస్తూ ఇంటి గేటు వద్దకు వచ్చాడు.

అక్కడ కుటుంబ సభ్యులు ప్రేమాభిమానాలు, ఆప్యాయతానురాగాలు కలగలిపి, పూలు చల్లుతూ భావోద్వేగభరిత స్వాగతం పలికారు. సైన్యంలో చేరిన తమ ఇంటివాడ్ని వారు ఆత్మీయంగానూ, గర్వంగానూ హత్తుకుని తమ హృదయ స్పందనను అతడికి వినిపించారు. వెల్కమ్ బ్యాక్ టు హోమ్ అంటూ అందంగా ముగ్గులు వేశారు. ఆ ఇంటి గేటు వద్ద కుటుంబ సభ్యులు, బంధువుల కోలాహలం అంతా ఇంతా కాదు. సైన్యంలో పనిచేయడం ఎంతటి గర్వకారణమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

punjabi-family-welcomes-young-soldier-with-red-carpet Watch Viral Video

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now