Rajasthan Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, భూవివాదంలో తమ్ముడిపై 8 సార్లు ట్రాక్టర్‌తో తొక్కి చంపిన అన్న, ఏం చేయొద్దని కుటుంబ సభ్యులు బతిమాలుతున్నా..
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు అన్న. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. అన్నదమ్ముల మధ్య భూ వివాదం హత్యకు దారి తీసింది. వరుసకు తమ్ముడు అయ్యే వ్యక్తిని.. కోపంలో కసి తీరా ట్రాక్టర్‌తో తొక్కి చంపాడు అన్న. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్ అవుతోంది. బహదూర్ సింగ్, అతర్ సింగ్ అన్నదమ్ములు. చాలా కాలంగా భరత్‌పూర్‌లోని ఉన్న కాస్త భూమి కోసం కొన్నేళ్లుగా ఈ రెండు కుటుంబాలు కొట్లాడుకుంటున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం బహదూర్ కుటుంబం వివాదాస్పద స్థలంలోకి ట్రాక్టర్‌తో వచ్చింది.
ఆ విషయం తెలిసి కాసేపటికే అతర్ సింగ్ కుటుంబం అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో రెండు కుటుంబాలు కర్రలతో పరస్పర దాడులకు దిగాయి. ఈ క్రమంలో అతార్ సింగ్ కొడుకు నిర్పత్ కిందపడిపోగా.. అది గమనించిన బహదూర్ కొడుకు దామోదర్ ట్రాక్టర్‌ను నిర్పత్ మీదుగా పోనిచ్చాడు. ఈ ఘర్షణలో దాదాపు 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి నలుగురుని అదుపులోకి తీసుకున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)