Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి
హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఫలక్ నామ ఎసిపి తెలిపిన వివరాల ప్రకారం.. ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఫాతిమా నగర్ వట్టే పల్లి వద్ద సాజిద్ అనే వ్యక్తిని తన ఇంటి వద్ద పాత కక్షలతో కత్తులతో దాడి చేసి హత్య చేసాడు సిద్దిక్ అనే వ్యక్తి. విషయాన్నీ తెలుసుకున్న పోలీసులు.. ఆ తరవాత సంఘటన స్థలం చేరుకున్నారు. పోలీసులు సాజిద్ ని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో మృతి చెందాడు. అయితే ఈ హత్యకి గల కారణాలు పాతకక్షలుగా ప్రాథమిక అంచనాగా పేర్కొన్నారు పోలీసులు.ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి సిధ్దక్ కోసం పోలీసులు వెతుకుతున్నామని తెలిపారు.
Here's Videos