Uttar Pradesh: వీడియో ఇదిగో, హిందూ మహిళను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం, హిందూ మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును కూడా మార్చుకున్న యువకుడు

యూపీలోని బస్తీ జిల్లాలో పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి ఏకంగా తన మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు

Muslim Man Converts To Hinduism To Marry Lover- DynamiteNews_)

యూపీలోని బస్తీ జిల్లాలో పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి ఏకంగా తన మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు.జిల్లాలోని నగర్ బజార్ ప్రాంతంలో నివసించే 34 ఏళ్ల సద్దాం హుస్సేన్, అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల హిందూ మహిళ ప్రేమల్లో పడ్డారు. వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో వారిద్దరూ పెళ్లి చేసుకోలేకపోయారు. తనను పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ సద్దాంను ఒత్తిడి చేసింది. అయితే ఆమెతో పెళ్లికి అతడి కుటుంబం ఒప్పుకోలేదు.

పనిమనిషి అకృత్యం.. యజమానికి ఇచ్చే జ్యూస్ లో మూత్రం కలిపి సర్వింగ్.. యూపీలో ఘటన (వీడియో)

దీంతో మూడు రోజుల కిందట సద్దాం హుస్సేన్‌, అతడి కుటుంబ సభ్యులపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనపై అత్యాచారం చేశాడని, గర్భస్రావం కోసం బలవంతం చేయడంతో పాటు చంపుతామని వారు బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో సద్దాం, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చేసేదేమి లేక సద్దాం హుస్సేన్‌ హిందూమతంలోకి మారాడు. తన పేరును శివశంకర్‌గా మార్చుకున్నాడు. జనవరి 19న ఆదివారం రాత్రి స్థానిక గుడిలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆ మహిళను పెళ్లి చేసుకున్నాడు.

Muslim Man Converts To Hinduism To Marry Lover

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now