West Bengal: కోల్‌కతాలో ఏం జరుగుతోంది, మూడు రోజుల్లో రెండో మోడల్ ఆత్మహత్య, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మంజుషా నియోగి
కోల్‌కతాలో మరో మోడల్ మృతిచెందింది. పటౌలీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు. గడిచిన మూడు రోజుల్లో కోల్‌కతాలో ఇద్దరు మోడళ్లు చనిపోయారు.
కోల్‌కతాలో మరో మోడల్ మృతిచెందింది. పటౌలీ ప్రాంతంలో ఉన్న ఇంట్లో ఉరి వేసుకుని ఆమె ఆత్మహత్య చేసుకున్నది. ఆత్మహత్య చేసుకున్న ఆ మోడల్‌ను మంజుషా నియోగిగా గుర్తించారు. గడిచిన మూడు రోజుల్లో కోల్‌కతాలో ఇద్దరు మోడళ్లు చనిపోయారు. అయితే ఆమె స్నేహితురాలు, మోడల్ అయిన బిదిషా డీ మజుందార్ రెండు రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో చనిపోయింది. ఫ్రెండ్ మృతితో డిప్రెషన్‌లోకి వెళ్లిన మంజూషా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. దుందుం ప్రాంతంలో ఉన్న అపార్ట్‌మెంట్‌లో బ్రైడల్ మేకప్ ఫోటో షూట్స్ చేసే మజుందార్ కూడా ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. రెండు వారాల క్రితం మరో పాపులర్ టీవీ నటి పల్లబి దేవ్ కూడా తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)