Salaar Part 1 Trailer Out: వీడియో ఇదిగో, ఎట్టకేలకు విడుదలైన సలార్ ట్రైలర్, ఖాన్సార్ అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్: సీజ్ ఫైర్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్రబృందం ఎట్టకేలకు విడుదల చేసింది. 'ఖాన్సార్' అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్ ఉంటుంది.
ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సలార్: సీజ్ ఫైర్ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ థియేట్రికల్ ట్రైలర్ ను చిత్రబృందం ఎట్టకేలకు విడుదల చేసింది. 'ఖాన్సార్' అనే కాల్పనిక నగరం నేపథ్యంలో సలార్ మొదటి పార్ట్ ఉంటుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన అప్ డేట్లు చూసినప్పుడే వయొలెన్స్ పీక్స్ లో ఉంటుందన్న విషయం అర్థమైంది.ట్రైలర్ చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు. ఇద్దరు ప్రాణస్నేహితులు బద్ధశత్రువులుగా మారడమే ఖాన్సార్ కథను మార్చింది అంటూ వాయిస్ ఓవర్ తో చెప్పించారు. దాంతో ఈ చిత్రంపై సక్తి పెరిగేలా చేశారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా సలార్: సీజ్ ఫైర్ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 22న ఈ చిత్రం వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న సలార్ మొదటి పార్టుకు A సర్టిఫికెట్ ఇచ్చారు.ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, టినూ ఆనంద్, ఈశ్వరీరావు, శ్రియా రెడ్డి, గరుడ రామ్ కీలక పాత్రలు పోషించారు. రవి బస్రూర్ సంగీతం అందించారు.
Here's Trailer