Vodafone Idea Hikes Mobile Plan Tariffs: టెల్కోల బాదుడు షురూ, మొన్న జియో.. నిన్న ఎయిర్‌టెల్.. నేడు వొడాఫోన్ ఐడియా, ఎంత పెరిగాయంటే..

రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ తమ ఫ్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. పెరిగిన ధరలు జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది

Smartphone Users Checking Mobile (Credits: X)

రిలయన్స్ జియో,ఎయిర్‌టెల్ తమ ఫ్రీపెయిడ్, పోస్టు పెయిడ్ చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. పెరిగిన ధరలు జులై 3 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని టెల్కోలు రెండూ ప్రకటించాయి. తాజాగా, ఈ జాబితాలో వొడాఫోన్ ఐడియా కూడా చేరింది. వివిధ కేటగిరీల్లో 11 నుంచి 24 శాతం వరకు ధరలు పెంచింది. ప్రస్తుతం రూ. 179గా ఉన్న ఎంట్రీలెవల్ ప్లాన్ ధరను 11శాతం పెంచి రూ.199 చేసింది. అలాగే, 84 రోజుల వ్యాలిడిటీతో లభించే రూ.719 ప్లాన్ ధరను రూ. 859కి పెంచింది. రూ.2,899కి లభించే వార్షిక ప్లాన్‌ ధరను 21 శాతం పెంచి రూ.3,499కి పెంచింది. జులై 4 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని తెలిపింది. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ధరలను పెంచేసిన ఎయిర్‌టెల్, పెంచిన ధరలు జులై 3 నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటన

Here's News

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now