 
                                                                 Hyd, Mar 1: ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో మోసాలు చేసే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులను కాజేస్తున్నారు కేటుగాళ్లు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఆధార్ కార్డుతో సిమ్ అనుసంధానం తప్పనిసరి కావడంతో దీనిని కూడా వదలడం లేదు కేటుగాళ్లు.
ఈ నేపథ్యంలో మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో తెలుసుకోవాలని ఉందా? (How Many SIMs linked to Your Aadhaar)ఆన్‌లైన్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) నిబంధనల ప్రకారం.. ఒక వ్యక్తి గరిష్టంగా 9 సిమ్ కార్డులను ఒక ఆధార్‌కు లింక్ చేయవచ్చు.ఈ పరిమితిని మించితే చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు.
తొలుత మీ టెలికాం ఆపరేటర్ వెబ్‌సైట్ ద్వారా చెక్ చేయండి..
()మీ టెలికాం ఆపరేటర్ (Airtel, Jio, Vi, లేదా BSNL) అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
Aadhaar Linking లేదా Verify Number ఆప్షన్ కోసం చూడండి.
మీ ఆధార్ వివరాలను ఎంటర్ చేసి రిక్వెస్ట్ సమర్పించండి.
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
మీ ఆధార్‌కు లింక్ చేసిన యాక్టివ్ నంబర్‌ల లిస్టును చూసేందుకు OTPని ఎంటర్ చేయండి.
() మొబైల్ USSD కోడ్ ద్వారా చెక్ చేయండి
()మీ మొబైల్ ఫోన్ నుంచి** *121# ** డయల్ చేయండి.
()లింక్ చేసిన మొబైల్ నంబర్‌లను చెక్ చేయడానికి స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
()ఈ సర్వీసును టెలికాం ఆపరేటర్లు త్వరిత ధృవీకరణ కోసం అందిస్తున్నారు.
()సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఆధార్-లింక్ చేసిన సిమ్‌లను చెక్ చేయండి.
()ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నంబర్‌లను ట్రాక్ చేసేందుకు సంచార్ సాథీ పోర్టల్ (https://www.sancharsaathi.gov.in/) విజిట్ చేయొచ్చు.
()సంచార్ సాథీ వెబ్‌సైట్‌ను విజిట్ చేసి ‘Citizen Centric Services’ పై క్లిక్ చేయండి.
()‘Know Your Mobile Connections (TAFCOP)’ ఆప్షన్ ఎంచుకోండి.
()మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేసి, మీ ఫోన్‌కు పంపిన OTP ఉపయోగించి ధృవీకరించండి.
()వెరిఫికేషన్ తర్వాత మీ ఆధార్‌కు లింక్ చేసిన మొబైల్ నంబర్‌ల జాబితాను చెక్ చేసుకోండి.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
