
Vijayawada, Mar 1: ఏపీలోని (AP) విజయవాడలో (Vijayawada) నేటి నుంచి కొత్త ట్రాపిక్ రూల్స్ (Traffic Rules) అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మేరకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మార్చి ఒకటో తేదీ నుండి కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ చట్టాన్ని రాష్ట్రంలో పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి ఒకటో తేదీ నుండి నూతన జరిమానాలను విధించేందుకు రవాణా శాఖ అధికారులతో పాటు పోలీస్ శాఖ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం వాహనదారులు నిబంధనలు అతిక్రమిస్తే విధించే జరిమానాలను పెంచినట్లు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
నేటి నుంచి విజయవాడలో కొత్త ట్రాఫిక్ రూల్స్ అమలు..
ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ఇద్దరూ హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే ఇద్దరికీ జరిమానా
డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోతే రూ. 10 వేలు ఫైన్
ఓవర్ స్పీడ్, రేసింగ్ తరహాలో డ్రైవింగ్ చేస్తే శిక్ష తప్పదు
రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిస్తే… pic.twitter.com/cP3nTUyZBQ
— BIG TV Breaking News (@bigtvtelugu) March 1, 2025
జరిమానాలివిగో....
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000
- వాహనానికి ఇన్సూరెన్స్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2,000, రెండవ సారి రూ. 4,000
- పొల్యూషన్ సర్టిఫికెట్ లేని పక్షంలో రూ. 1500 ఫైన్
- హెల్మెట్ ధరించకుండా బైక్ నడిపే వారికి రూ. 1000, అలాగే బైక్ వెనుక సీట్ లో కూర్చున్న వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో రూ. 1000
- అతివేగంతో వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 1500, రెండవసారి రూ. 10000
- ఆటో, లారీ డ్రైవర్లు యూనిఫామ్ ధరించకుండా వాహనాన్ని నడిపితే మొదటిసారి రూ. 150, రెండవసారి రూ. 300
- రవాణా వాహనాల్లో ప్రయాణికులను ఎక్కిస్తే ఒక్కొక్కరికి రూ.200 చొప్పున జరిమానా
- వాహన తనిఖీ అధికారులకు సహకరించని వాహన యజమానులకు రూ. 750
- కారులో ప్రయాణించేవారు సీటు బెల్ట్ ధరించని పక్షంలో రూ. 1000
- కారు డ్రైవర్ సీట్ బెల్ట్ ధరించని పక్షంలో మరో రూ. 1000
- వాహన రిజిస్ట్రేషన్ లేనిపక్షంలో రూ. 2000
- ఫిట్నెస్ సర్టిఫికెట్ లేని పక్షంలో మొదటిసారి రూ. 2000, రెండవ సారి రూ. 5000
- రేసింగ్ వంటి కార్యకలాపాలకు పాల్పడితే మొదటిసారి రూ. 5000, రెండవసారి రూ. 10,000
- మితిమీరిన వేగంతో వాహనం నడిపితే రూ. 1000
- ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తే రూ. 1000 జరిమానా