
Hyd, Feb 28: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది జాడ తెలిసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడను గుర్తించే పనిలో భాగంగా (SLBC Tunnel Collapse Update) ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టీబీఎం మిషన్‌ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్‌తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టగా గల్లంతైన కార్మికుల ఆనవాళ్లు బయటపడినట్లు సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన ఏదీ లేదు.
ఈరోజు కార్మికుల జాడ కోసం (Telangana SLBC Tunnel Collapse Update) అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా.. ఐదుచోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్‌లో గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్నభాగంలో ఐదు మెత్తని భాగాలను గుర్తించారు. దీంతో చిక్కుకుపోయిన వారు అక్కడే ఉన్నట్లుగా సహాయక సిబ్బంది భావిస్తున్నారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల ప్రమాదం..6వ రోజుకు చేరిన రెస్క్యూ ఆపరేషన్, ఇంతవరకు లభ్యం కానీ 8 మంది ఆచూకీ
ఆ మెత్తని భాగాలు మానవ దేహాలు కావచ్చు.. కాకపోవచ్చు అని అధికారులు పేర్కొంటున్నారు. మెత్తని భాగాలు ఉన్నచోట తవ్వకాలు జరపనున్నారు. తవ్విన తర్వాత మానవ దేహాలా కాదా అనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఈ ఘటనలో గల్లంతైనవారి పరిస్థితిపై కాసేపట్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది.
నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ లో భాగంగా ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా తప్పిపోయిన వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేసి మృతదేహాలను గుర్తించింది.ఇందులో ఐదు అనుమానాస్పద ప్రదేశాలను గుర్తించడంతో పాటు శరీర నిఘా కోసం మార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు.