Anand Mahindra: సింధుకు గిఫ్ట్ ఇవ్వమని కోరిన నెటిజన్, బంగారానికి ఎప్పుడో ఇచ్చానని తెలిపిన ఆనంద్ మహీంద్రా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మహీంద్రా రిప్లయి ట్వీట్

రెండోసారి ఒలింపిక్‌ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అభినందిస్తూ పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌.. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది

Mahindra Group Chairman Anand Mahindra offers internship to a millionaire’s son (Photo-Twitter)

రెండోసారి ఒలింపిక్‌ పతకం కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అభినందిస్తూ పారిశ్రామిక దిగ్గజం మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్‌పై నెటిజన్లు రీట్వీట్‌ చేస్తున్నారు. దీనిపై కామెంట్ల కూడా చేస్తున్నారు. ఈ సమయంలో ఓ నెటిజన్‌ చేసిన కామెంట్‌.. ఆ ట్వీట్‌కు ఆనంద్‌ మహేంద్ర రిప్లయ్‌ ఇవ్వడం వైరల్‌గా మారింది.

సింధును అభినందిస్తూ ఆనంద్‌ మహీంద్ర చేసిన ట్వీట్‌పై శుభ్‌ వదేవాల కామెంట్‌ చేశారు. ‘సింధు అత్యుత్తమ ప్రదర్శనకు థార్‌ (మహీంద్ర కంపెనీకి చెందిన వాహనం) కానుక’ అని రిప్లయ్‌ ఇచ్చారు. సింధుకు థార్‌ కావాలి అనే హ్యాష్‌ట్యాగ్‌ కూడా క్రియేట్‌ చేశారు. ఈ కామెంట్‌ను చూసిన ఆనంద్‌ రిప్లయ్‌ ఇచ్చాడు. ‘సింధుకు ఇంతకుముందే థార్‌ వాహనం ఉంది’ అని మహేంద్ర తెలిపారు.

రియో ఒలింపిక్స్‌లో విజయం సాధించినప్పుడు సింధుకు థార్‌ వాహనం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను కూడా పంచుకున్నారు. సాక్షి మాలిక్‌తో కలిసి సింధు థార్‌ ఎస్‌యూవీ వాహనంపై తిరుగుతున్న ఫొటోతో ఆ నెటిజన్‌కు బదులిచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement