Srikakulam, Jan 25: శ్రీకాకుళం (Srikakulam) సూర్యామహళ్ జంక్షన్ లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ (South India Shopping Mall) లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విలువైన వస్త్రాలు తగులబడ్డాయి. ఉదయం ప్రమాదం జరుగడం, షాప్ క్లోజింగ్ ఉండటంతో ప్రాణ నష్టం ఏమీ జరుగలేదు. నిప్పురవ్వలు బట్టలపై పడటంతో షాపింగ్ మాల్ అంతటా దట్టంగా పొగ అలుముకున్నది. సమాచారం అందుకుని ఘటనా స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు మంటలను అదుపు చేస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
కేసీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయన సోదరి చీటి సకలమ్మ కన్నుమూత.. నేడు అంత్యక్రియలు
Here's Video:
శ్రీకాకుళం సూర్యామహళ్ జంక్షన్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో భారీ అగ్నిప్రమాదం...
షాపింగ్ మాల్ అంతటా దట్టంగా అలుముకున్న పొగలు, తగలబడుతోన్న విలువైన వస్త్రాలు
ఘటనా స్థలికి చేరుకున్న రెండు ఫైర్ ఇంజన్లు, మంటలను అదుపు చేస్తోన్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/D40dLfZEe5
— ChotaNews App (@ChotaNewsApp) January 25, 2025
హైదరాబాద్ మహీంద్రా షో రూమ్ లోనూ
హైదరాబాద్ లోని (Hyderabad) కొండాపూర్ లో ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident In Mahindra Showroom) జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి. రెండో అంతస్తులో ఓయో రూమ్స్ హోటల్ ఉంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు అర్పాయి. అప్పటికే భారీగానే నష్టం జరిగింది. ఇక హోటల్ లోని వాళ్లను అప్పటికే ఖాళీ చేయించారు పోలీసులు. ఉడిపి గ్రాండ్ లో ఉన్నవారందరినీ కూడా బయటకు పంపారు. పక్కనే ఉన్న స్కోడా కార్ల షోరూమ్ కు మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్ తో సిబ్బంది మంటలు ఆర్పడంతో మరో ప్రమాదం తప్పింది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి.. మరో ఇద్దరికి గాయాలు