Fire Accident In Mahindra Showroom (Credits: X)

Hyderabad, Jan 24: హైదరాబాద్‌ లోని (Hyderabad)  కొండాపూర్ లో ఏఎంబీ మాల్  వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident In Mahindra Showroom) జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి. రెండో అంతస్తులో ఓయో రూమ్స్ హోటల్ ఉంది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ ఇంజన్లు మంటలు అర్పాయి. అప్పటికే భారీగానే నష్టం జరిగింది. ఇక హోటల్ లోని వాళ్లను అప్పటికే ఖాళీ చేయించారు పోలీసులు. ఉడిపి గ్రాండ్ లో ఉన్నవారందరినీ కూడా బయటకు పంపారు. పక్కనే ఉన్న స్కోడా కార్ల షోరూమ్‌ కు మంటలు వ్యాపించకుండా ఫైర్ ఇంజిన్‌ తో సిబ్బంది మంటలు ఆర్పడంతో మరో ప్రమాదం తప్పింది.

నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు

నష్టం ఇలా..

మహీంద్రా షో రూమ్‌ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 ఖరీదైన కార్లు, వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం అగ్నికి ఆహుతయ్యాయి. సకాలంలో ఎంప్లాయిస్ షోరూమ్ వద్దకు చేరుకుని నాలుగు వెహికల్స్ బయటకు తీసుకురావడంతో కొంత ఉపశమనం లభించింది. కాగా ఈ ప్రమాదంలో దాదాపు పది కోట్ల రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా.

నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు