'New CEO Of Twitter': ట్విట్టర్ కొత్త సీఈఓగా ఎలాన్ మస్క్ పెంపుడు కుక్క, సంచలన ట్వీట్ చేసిన టెస్లా అధినేత, మండిపడుతున్న నెటిజన్లు
ట్విట్టర్‌కు కొత్త సీఈవోను పరిచయం చేస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. మస్క్ పెంపుడు కుక్క ఫోల్కీ(pet dog Floki )ని ట్విట్టర్ సీఈవో సీట్‌లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగాడు. ‘ట్విట్టర్ కొత్త సీఈవో ఇతనే..’ అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ట్విట్టర్ కొత్త బాస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి సంచలన పోస్టుతో వివాదాల్లోకి ఎక్కారు. ట్విట్టర్‌కు కొత్త సీఈవోను పరిచయం చేస్తూ ఆయన వార్తల్లో నిలిచారు. మస్క్ పెంపుడు కుక్క ఫోల్కీ(pet dog Floki )ని ట్విట్టర్ సీఈవో సీట్‌లో కూర్చోబెట్టిన మస్క్.. సీఈవో అని రాసి ఉన్న టీ షర్ట్‌ను తొడిగాడు. ‘ట్విట్టర్ కొత్త సీఈవో ఇతనే..’ అంటూ ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అంతేకాదు ‘ఇతర సీఈవోల కన్నా ఇదే బెటర్.. నెంబర్లలోనూ, స్టైల్లోనూ’ అంటూ పరోక్షంగా మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్‌ను ఉద్దేశిస్తూ వరుస ట్వీట్లు చేశారు.మస్క్ చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ‘ముందు ట్విట్టర్ పని తీరుపై శ్రద్ధ పెట్టండి, మాజీ సీఈవోపై కాదు’, ‘పరాగ్ అగర్వాల్ నేతృత్వంలో ట్విట్టర్ అద్భుతమైన పనితీరు సాధించింది. మెరుగైన వృద్ధిని కనపరిచింది’ అంటూ వరుస కామెంట్లు పెడుతున్నారు.
Here's Tweets
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)