Kerala: షాకింగ్ వీడియో, మైనర్‌ బాలికపై 30 ఏళ్ల వ్యక్తి దారుణం, ఏ కారణం లేకుండానే ఆమెను పైకి ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేసిన కేరళ వాసి

కాసర్‌గడ్‌ జిల్లాలోని మంజేశ్వర్‌లో ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది.

Representational Image | (Photo Credits: PTI)

కేరళలో మైనర్‌ బాలికపై 30 ఏళ్ల ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. కాసర్‌గడ్‌ జిల్లాలోని మంజేశ్వర్‌లో ఏ కారణం లేకుండానే తొమ్మిదేళ్ల విద్యార్థిని అమాంతం ఎత్తి కిందపడేశాడు. ఆయిరం జుమా మసీదు సమీపంలో చిన్నారి బుర్ఖా ధరించి నిలబడి ఉంది. ఇంతలో బాలిక వైపు కోపంగా వచ్చిన వ్యక్తి ఆమెను ఎత్తి ఒక్కసారిగా నేలపై పడేశాడు. అనంతరం అక్కడి నుంచి మళ్లీ తన దారిన తను వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందితుడు ఉధ్యవరం నివాసి అబూబకర్ సిద్దిక్ (30)గా గుర్తించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)