Bihar: వీడియో ఇదిగో, తాగుబోతు భర్త హింస తట్టుకోలేక లోన్ రికవరీ ఏజెంట్‌తో పారిపోయిన మహిళ, వీరి వివాహాన్ని చూసేందుకు ఎగబడిన స్థానికులు
తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాగుబోతు భర్త వేధింపులతో విసిగిపోయిన భార్య లోన్ రికవరీ కోసం గ్రామానికి వచ్చిన ఏజెంట్‌తో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకున్న ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బీహార్‌లోని జముయ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకెళితే.. తన భర్త తాగి వచ్చి తనను కొట్టేవాడని, శారీరకంగా వేధించేవాడని అందుకే..అతడి హింసను భరించలేక పరిచయమైన పవన్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.
ఫిబ్రవరి 11న త్రిపురారి ఘాట్ సమీపంలోని ఆలయంలో హిందూ ఆచారం ప్రకారం వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట వివాహాన్ని చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. కాగా జాజల్ గ్రామానికి చెందిన బ్యాంకు ఉద్యోగి పవన్ కుమార్ రుణాల రికవరీ కోసం పలు గ్రామాలను సందర్శిస్తూ..కొన్ని నెలల కిందట కర్మ టాండ్ గ్రామానికి వెళ్లాడు. అక్కడ ఇందిరా కుమారిని కలవడం ఫోన్ నంబర్ ఇచ్చుకోవడం చకచకా జరిగిపోయాయి.
Woman Elopes With Loan Recovery Agent To Get Married in bihar