Newly Married Couple Shot Dead: దారుణం, పెళ్ళయిన కొత్త జంటను పార్కులో కాల్చి చంపిన బంధువుల, ప్రేమ వివాహమే కారణం
వివాహం అయిన రెండు నెలల తర్వాత కొత్త దంపతులను కాల్చి చంపారు. సోమవారం ఉదయం హిసార్ జిల్లాలోని హన్సిలో కొత్తగా పెళ్లయిన జంటను కాల్చి చంపిన వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది
హర్యానాలో అనుమానాస్పద పరువు హత్య కలకలం రేపింది. వివాహం అయిన రెండు నెలల తర్వాత కొత్త దంపతులను కాల్చి చంపారు. సోమవారం ఉదయం హిసార్ జిల్లాలోని హన్సిలో కొత్తగా పెళ్లయిన జంటను కాల్చి చంపిన వీడియో సోషల్ మీడియాలో బయటకు వచ్చింది.సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, బాదలా గ్రామానికి చెందిన ఒక మహిళ, పార్క్‌లో ఉండగా, ఇద్దరు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు వారిపై దాడి చేశారు. ఇద్దరూ బంధువులు అయినప్పటికీ, వారి కుటుంబాలు పెళ్ళిని వ్యతిరేకించడంతొ ఏప్రిల్ 22 న ఘజియాబాద్‌లో ఈ జంట వివాహం చేసుకున్నారు. ఘటనపై కచ్చితమైన పరిస్థితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది" అని హన్సి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మక్సూద్ అహ్మద్ తెలిపారు. ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు పక్కన వెళుతున్న తల్లీబిడ్డలను ఢీకొట్టిన కారు, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)