Hyderabad Traffic Police: మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా, ట్రాఫిక్ రూల్స్‌పై హైదరాబాద్ పోలీసుల సంధర్భోచిత ట్వీట్ ఇదిగో.,

హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో ట్రాఫిక్ రూల్స్ మీద ఓ ట్వీట్‌ చేశారు. రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ ఫేమస్ డైలాగ్ అందులో యాడ్ చేశారు. హెల్మెట్ లేని వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ రాశారు.

Midhi motham 1000 ayindhi, user charges extra Hyderabad Traffic police Shares Funny Image on Traffic Rules

హైదరాబాద్‌ సిటీ పోలీసులు ట్విటర్‌లో ట్రాఫిక్ రూల్స్ మీద ఓ ట్వీట్‌ చేశారు. రోడ్డుపై మీల్స్ అమ్మే కుమారి ఆంటీ ఫేమస్ డైలాగ్ అందులో యాడ్ చేశారు. హెల్మెట్ లేని వ్యక్తి ఫోటోను షేర్ చేస్తూ.. మీది మొత్తం వెయ్యి రూపాయిలు.. యూజర్ ఛార్జీలు ఎక్స్‌ట్రా’ అంటూ క్యాప్షన్ రాశారు. బుల్లెట్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ, ఫోన్ మాట్లాడుతూ వెళ్తున్న ఫొటోతో కూడిన క్యాప్సన్ నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పాటుగా ట్రాఫిక్‌ నియమాలు పాటించండి.. క్షేమంగా ఇంటికి చేరుకోండి అని పేర్కొన్నారు.సందర్భాన్ని బట్టి సినిమా డైలాగ్స్, సోషల్ మీడియాలో పాపులర్ అయిన డైలాగ్స్‌ను ఉపయోగిస్తూ ట్రాఫిక్‌ నిబంధనలపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు వినూత్నంగా అవగాహన కల్పిస్తున్న సంగతి విదితమే.  వీడియో ఇదిగో, ఇనుప చువ్వలతో వెళుతున్న రిక్షా పైకి బస్సు దూసుకెళ్లిన బస్సు, ఇనుప చువ్వలు గుచ్చుకోవడంతో బస్సులో ఉన్న 8 మందికి గాయాలు

Here's Tweet

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now