Clouds Floating Down Video: ఈ అద్భుతమైన వీడియో ఇప్పటిదాకా మీరు చూసి ఉండరు.. పట్టణాన్ని మింగేస్తున్నట్లుగా దూసుకువచ్చిన మేఘాలు, మళ్లీ వెనక్కి వెళుతూ..

నాగాలాండ్ మంత్రి ట్విట్టర్లో అధ్బుతమైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కొండ ప్రాంతం నుంచి మేఘాలు కిందకు వచ్చి అక్కడున్న పట్టణాన్ని కమ్మేస్తూ.. మళ్లీ వెనక్కి వెళుతూ.. తిరిగి కమ్మేస్తూ అలరించాయి.

Clouds Floating Down

నాగాలాండ్ మంత్రి ట్విట్టర్లో అధ్బుతమైన వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కొండ ప్రాంతం నుంచి మేఘాలు కిందకు వచ్చి అక్కడున్న పట్టణాన్ని కమ్మేస్తూ.. మళ్లీ వెనక్కి వెళుతూ.. తిరిగి కమ్మేస్తూ అలరించాయి. నాగాలాండ్ లోని ఓ కొండ ప్రాంతంలో ఉదయం ఓసారి.. సాయంత్రం మరోసారి ఈ అందమైన దృశ్యం కనువిందు చేసింది. నాగాలాండ్ రాష్ట్ర మంత్రి తంజెన్ ఇమ్నా అలాంగ్ ఈ వైరల్ వీడియోను షేర్ చేశారు.

ఈ వీడియోలో కొండలపై నుంచి వచ్చిన మేఘాలు కొంత సేపట్లోనే దిగువకు జారుతూ పట్టణం, లోయ ప్రాంతం మొత్తాన్ని కమ్మేశాయి. మళ్లీ వాతావరణం మారినకొద్దీ మేఘాలు కదిలిపోయాయి. ఒక్క రోజులోనే 2.2 లక్షల మంది చూశారు. 11 వేలకుపైగా లైకులు వచ్చాయి. వేల మంది రీట్వీట్ చేశారు. ఈ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉందని వేలాది మంది కామెంట్ చేశారు. ఈ దృశ్యం నాగాలాండ్ లోని కోహిమా సమీపంలోనిదని మరికొందరు తమ కామెంట్లలో పేర్కొన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement