Video: విషాదకర వీడియో, నృత్యం చేస్తూ స్టేజీ మీదనే గుండెపోటుతో కుప్పకూలిన ఆర్టిస్ట్, ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు ప్రకటన

జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఓ యువకుడు స్టేజీపై నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Artiste dies of heart attack after collapsing midway during stage performance

జమ్మూలోని బిష్నా ప్రాంతంలో ఓ యువకుడు స్టేజీపై నృత్య ప్రదర్శన ఇస్తూ కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతన్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ గణేశ్‌ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగేశ్‌ గుప్తా (20) అనే కళాకారుడు పార్వతీదేవి వేషధారణలో నృత్యం చేయడం ప్రారంభించాడు. కొద్దిసేపు నృత్యం చేసిన తర్వాత ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement