Priyanka Chopra injured Video: ప్రియాంక చోప్రాకు షూటింగులో తీవ్ర గాయాలు, వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం అంటూ ఫోటోలు ట్వీట్ చేసిన మాజీ మిస్ వరల్డ్
ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు
ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా ది బ్లఫ్ షూటింగులో గాయపడ్డారు. ఆమె కీలక పాత్రలో నటిస్తోన్న 'ది బ్లఫ్' షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతోంది. షూటింగ్ సందర్భంగా తాను గాయపడ్డానని చెబుతూ సోషల్ మీడియా వేదికగా గాయానికి సంబంధించిన ఫొటోలను ఆమె షేర్ చేశారు. ఫొటోను చూస్తే ఆమె ముఖం, మెడపై గాయాలు అయినట్లుగా ఉంది.
'వృత్తి జీవితంలో ఎదురయ్యే ప్రమాదం' అంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రియాంక గాయపడటంతో చిత్ర బృందం షూటింగ్‌ను నిలిపివేసింది. అయితే, ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై స్పష్టత లేదు. ఆమెను సిడ్నీలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రస్తుతం ఆమె విశ్రాంతి తీసుకుంటున్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)