Red Ant Chutne Video: ఎర్ర చీమలు చట్నీ వీడియో ఇదిగో, సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న రెడ్ యాంట్ చట్నీ వీడియో
ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 25 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఫుడ్ గయ్ రిషీ పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటంబం ఎర్ర చీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు.
ఎర్ర చీమలు చట్నీకి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇన్ స్టా గ్రామ్ లో ఏకంగా 25 మిలియన్లకుపైగా వ్యూస్ సాధించి రికార్డుల వైపు దూసుకుపోతోంది. ఫుడ్ గయ్ రిషీ పేరుతో ఓ ఇన్ స్టాగ్రామ్ వ్లాగర్ తాజాగా ఒడిశాలో ఓ గిరిజన కుటంబం ఎర్ర చీమలను పట్టుకొని చట్నీ తయారు చేసే వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు. ఆ చట్నీ గురించి నెటజన్లందరికీ అర్థమయ్యేలా తయారీ విధానం గురించి వీడియోలో ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో వివరించాడు. వీడియో ఇదిగో, ఖాళీ దగ్గు మందు సీసాను మింగిన తాచుపాము, అది నోట్లో ఇరుక్కుపోవడంతో శ్వాస ఆడక విలవిల
ఆ వీడియోలో ముందుగా ఓ మహిళ చెట్టుపై ఉన్న ఎర్ర చీమల గూడును పొడవాటి కర్ర సాయంతో తెంపి నేలపై పరిచిన బట్టపై పడేసింది. ఆ గూడులో తెల్లటి చీమ గుడ్లు కూడా ఉన్నాయి. ఆ వెంటనే దాన్ని ఓ డబ్బాలో వేసింది. అనంతరం వాటిని ఓ పళ్లెంలో వేసి అందులోంచి చెత్తా చెదారాన్ని తొలగించింది. చివరగా రోట్లో కాసిని ఎండుమిర్చి, ఉప్పు, తరిగిన వెల్లుల్లి, ఉల్లిగడ్డలు వేసి దంచి ఆ మిశ్రమంలో ఎర్ర చీమలు, కాస్త నీరు కలిపి మళ్లీ దంచింది. అంతే.. రుచికరమైన ఎర్ర చీమల చట్నీ రెడీ అయిపోయింది.ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఒడిశాలో ప్రజాదరణ పొందిన ఎర్ర చీమల చట్నీకి ఈ ఏడాది జనవరి 2న ప్రతిష్టాత్మక జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటే జీఐ ట్యాగ్ లభించింది. వైరల్ వీడియోలో తయారైన చట్నీని జీఐ ట్యాగ్ పొందిన చట్నీ పోలి ఉంది. ఈ చట్నీని ఒడిశావాసులు స్థానికంగా కాయ్ చట్నీ అని పిలుస్తారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)