Telangana: డ్రగ్స్‌కు బానిసైన కొడుకు, కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం కొట్టిన తల్లి, మంట మంట అంటూ అల్లాడిన బాధితుడు, సోషల్ మీడియాలో వీడియో వైరల్

కోదాడలో 15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది.

Mother beaten drug addicted son in Kodada (Photo-Video Grab)

తెలంగాణలో సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయికి బానిసైన కుమారుడికి తల్లి దేహశుద్ధి చేసిన ఘటన వీడియో వెలుగులోకి వచ్చింది. కోదాడలో 15 ఏళ్ల కుర్రాడు గంజాయి లేనిదే బతకలేని స్థితికి వచ్చాడు. కొడుకు మాదక ద్రవ్యాలకు బానిస కావడాన్ని ఆ తల్లి తట్టుకోలేకపోయింది. ఎన్నోసార్లు చెప్పినా వినకపోవడంతో.. కొడుకును ఓ కరెంటు స్తంభానికి కట్టేసి కళ్లలో కారం చల్లింది. దాంతో ఆ కుర్రాడు మంట మంట అంటూ గగ్గోలెత్తిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)