Mystery Creature: అర్థరాత్రి రెండు కాళ్లతో రోడ్డు మీద భయానక జీవి, సీసీటీవీ కెమెరాలో రికార్డు, భయాందోళనకు గురవుతున్న టెక్సాస్ పరిసర ప్రాంతాల ప్రజలు

ప్రపంచంలో ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయిన జంతువులు చాలా ఉన్నాయని కొందరు అంటారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లోని అమారిలో పట్టణంలో గత జూ ముందు ఓ వింత జీవి కనిపిచింది.

Unidentified creature spotted roaming Texas zoo (Photo-Twitter)

ప్రపంచంలో ఇప్పటికీ మనిషి కనుక్కోలేకపోయిన జంతువులు చాలా ఉన్నాయని కొందరు అంటారు. దీనికి సంబంధించి తాజాగా ఒక ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. అమెరికాలోని టెక్సాస్‌లోని అమారిలో పట్టణంలో గత జూ ముందు ఓ వింత జీవి కనిపిచింది. రెండుకాళ్లపై నిలబడి ఉందా జీవి. ఈ ఫొటో చూసిన నెటిజన్లు అది నిజంగా వింత జీవేనా? లేక ఎవరైనా మనుషులే అలాంటి గెటప్‌లో వచ్చారా? అని ఆలోచిస్తున్నారు. గత నెల 21వ తేదీన అర్థరాత్రి పూట, తెల్లారిజామున ఈ జీవి పలుమార్లు ఇక్కడ కనిపించినట్లు సమాచారం. దీనిపై తాము దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

టెక్సాస్‌లోని ఒక ‘జూ’లో మే 21వ తేదీన అర్ధరాత్రి 1:25 సమయంలో రెండుకాళ్లపై ఓ జీవి నిలబడి ఉంది. ఈ క‍్రమంలో జూలో ఉన్న సెక్యూరిటీ కెమెరాలో ఇది రికార్డు అయ్యింది. అయితే, ఆ జీవి జూ అవతల ఫెన్సింగ్‌ దగ్గర ఉన్నట్టు సిబ్బంది గుర్తించారంటూ.. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. ఇక, ఈ ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలవడంతో ఫొటోపై నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement