Video: వీడియో ఇదిగో, పాము తలను కొరికేసిన యువకుడు, అది కరిచిందని కోపమే కారణం, రక్తం కారుతుంటే వీడియో తీసిన స్నేహితులు

తమిళనాడులో ఓ యువకుడు పాము తలను కొరికి వేరు చేశాడు. రాణిపేటలో జరిగిన ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు పాము తలను కొరుకుతుండగా అతడి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహన్ అనే యువకుడు పామును చేతపట్టి దాని తలను నోటితో కొరికి వేరుచేశాడు.

biting off snake's head (Photo-Video Grab)

తమిళనాడులో ఓ యువకుడు పాము తలను కొరికి వేరు చేశాడు. రాణిపేటలో జరిగిన ఈ ఉదంతంలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. యువకుడు పాము తలను కొరుకుతుండగా అతడి స్నేహితులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మోహన్ అనే యువకుడు పామును చేతపట్టి దాని తలను నోటితో కొరికి వేరుచేశాడు.

పాము తనను కాటేసిందంటూ ఈ దారుణానికి పాల్పడ్డాడు. అతడి ఇద్దరు స్నేహితులు తొలుత వారించినా వినిపించుకోకుండా ఈ పనికి పాల్పడ్డాడు. కాగా.. రక్తమోడుతున్న పామును చూసి ఆ ముగ్గురు యువకులు ఆనందించడం వీడియోలో రికార్డయింది. ఈ ఘటన గురించి పర్యావరణ కార్యకర్తలు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో నిందితులు కటకటాల పాలయ్యారు.

Here's Video

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement