Vinesh Phogat Resigns: రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసిన వినేశ్‌ ఫోగట్‌, నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా వార్తలు

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు .

Vinesh Phogat (Photo Credits: @mr_mayank/X)

భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ (Vinesh Phogat ) కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వినేశ్‌ ఫోగట్‌ తాజాగా కీలక ప్రకటన చేశారు. రైల్వేస్‌లో తన ఉద్యోగానికి రాజీనామా (resigns from her post in Indian Railways) చేసినట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు . వినేశ్‌ ఫోగట్ (Vinesh Phogat)‌, బజరంగ్‌ పునియా (Bajrang Punia) కాంగ్రెస్‌ పార్టీలోకి చేరుతున్నారంటూ గత కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. విభాగానికి సరిపోయేంత బ‌రువు ఉండ‌డం అనేది అథ్లెట్ల బాధ్య‌త, వినేశ్ ఫోగాట్ అప్పీల్‌పై 24 పేజీల తీర్పును వెల్లడించిన కాస్

త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరికీ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెజ్లర్లు ఇవాళ హస్తం పార్టీలో చేరుతున్నట్లు జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. మధ్యాహ్నం 1:30 గంటలకు కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ సమక్షంలో వీరిద్దరూ కాంగ్రెస్‌లోకి చేరుతున్నట్లు సదరు కథనాలు వెల్లడించింది.

Here's Her Tweet

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement