Viral Video: పిల్లి కోసం ప్రత్యేక హెల్మెట్.. భారతీయుడి క్రియేటివిటీకి పోలీసులే షాక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను ఆకట్టుకుంటున్న వీడియో ఇదిగో..
Viral Video:పెంపుడు జంతువులపై ప్రేమను ఒక్కొక్కరు ఒక్కో విధంగా చూపిస్తుంటారు. అయితే ఓ భారతీయుడు తన పిల్లి భద్రత కోసం ఏకంగా ప్రత్యేకంగా హెల్మెట్ తయారు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పిల్లికి సరిపోయేలా తయారు చేసిన ఈ చిన్న హెల్మెట్‌లో ముందువైపు పారదర్శక వైజర్ కూడా ఉండటం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ వీడియోను చూసిన పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. పోలీసుల సమక్షంలో పిల్లి హెల్మెట్ ధరించిన దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన బైక్‌పై పిల్లితో కనిపించాడు. పిల్లి తలకు ప్రత్యేకంగా రూపొందించిన చిన్న హెల్మెట్ పెట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. సాధారణంగా మనుషుల కోసం ఉపయోగించే హెల్మెట్ల మాదిరిగానే కనిపించేలా దీన్ని రూపొందించారు. పిల్లి తలకు సరిపోయే పరిమాణంలో ఉండటంతో పాటు ముందు వైపు వైజర్ కూడా అమర్చినట్లు వీడియోలో గమనించవచ్చు. ఈ వినూత్న ఆలోచనను చూసి అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది ఆశ్చర్యంగా స్పందించినట్లు వైరల్ క్లిప్‌లో కనిపిస్తోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చిన వెంటనే భారీగా షేర్లు, కామెంట్లు వచ్చాయి. కొంతమంది నెటిజన్లు పిల్లి భద్రత గురించి ఆలోచించిన వ్యక్తిని అభినందిస్తుండగా.. మరికొందరు మాత్రం బైక్‌పై పిల్లిని తీసుకెళ్లే విధానంపై ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రమాదం జరిగినప్పుడు కేవలం హెల్మెట్ పెట్టడం మాత్రమే కాకుండా పెంపుడు జంతువును సురక్షితంగా తీసుకెళ్లే విధానం కూడా ముఖ్యమని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
Indian Man’s Unique Cat Helmet Amazes Police Officers