Team India Dance Video: వీడియో ఇదిగో, వాంఖడే స్టేడియంలో చిందేసిన టీమిండియా ఆటగాళ్లు, క్రికెట్ అభిమానులతో నిండిపోయిన స్టేడియం
మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇతర భారత క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది.మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖెడే స్టేడియానికి చేరుకున్నారు. వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, ఇతర భారత క్రికెటర్లు డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఆటగాళ్లు డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, అభిమానుల కోసం ట్రోఫీని పైకి ఎత్తిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ద్వయం
Here's Video