Viral Video: ఇదేం ఫైట్ బాబోయ్, లోకల్ ట్రైన్‌లో జుట్టు పట్టుకుని కొట్టుకున్న ముగ్గురు మహిళలు, అడ్డు వచ్చిన పోలీస్ అధికారిణికి గాయాలు, కేసు నమోదు చేసుకున్న రైల్వే పోలీసులు

ముంబై లోక్‌ల్‌ ట్రైన్‌లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థానే నుంచి పన్వేల్‌ వెళ్తున్న లోకల్‌ రైలు మహిళల కంపార్ట్‌మెంట్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.

All-Out Fight Between Women On Thane-Panvel local train in Mumbai (Photo-Video Grab)

ముంబై లోక్‌ల్‌ ట్రైన్‌లో మహిళా ప్రయాణికులు కొట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. థానే నుంచి పన్వేల్‌ వెళ్తున్న లోకల్‌ రైలు మహిళల కంపార్ట్‌మెంట్‌లో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీస్ అధికారి శంభాజీ కటారే తెలిపిన వివరాల ప్రకారం.. తుర్భే స్టేషన్ వద్ద రైలు ఆగడంతో కొందరు మహిళలు ట్రైన్‌ ఎక్కారు. ట్రైన్‌లో ఒక్క సీటు మాత్రమే ఖాళీగా ఉండటంతో ఓ మహిళ అందులో కూర్చొని మరో మహిళకు కూడా సీట్‌ ఇచ్చేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో మూడో మహిళ వచ్చి ఆ సీటులో కూర్చుంది.

దీంతో ఒక్క సీటు కోసం ముగ్గురు మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పెద్దపెద్దగా అరుస్తూ ఒకరిపైఒకరు చేయిచేసుకున్నారు. ఈ కొట్లాటలో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వీరిని ఆపేందుకు ప్రయత్నించిన మహిళ అధికారికి సైతం గాయాలయ్యాయి. ఈ ఘటనలో ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై వాషి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్‌పీ) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement