Bharat Jodo Yatra: వైరల్ వీడియో, బీజేపీ కార్యకర్తలపై ముద్దుల వర్షం కురిపించిన రాహుల్ గాంధీ, రాజస్థాన్ రాష్ట్రంలో ఆసక్తికర ఘటన

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌(ముద్దులు) వర్షం కురిపించారు.

Rahul Gandhi Kisses Video (Photo-Video Grab)

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర సందర్భంగా ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఝలావార్‌లో యాత్ర ప్రారంభించిన రాహుల్‌ గాంధీ.. బీజేపీ కార్యాలయం దాటుతుండగా ఆ భవనంపై ఉన్న కాషాయ కార్యకర్తలకు ఫ్లైయింగ్‌ కిస్సెస్‌(ముద్దులు) వర్షం కురిపించారు.వారిని చూస్తూ గాల్లో ముద్దులు పెట్టారు. బీజేపీ, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌లే లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేసిన మరుసటి రోజునే.. ఈ విధంగా ప్రవర్తించటం ప్రాధాన్యం సంతరించుకుంది. రాహుల్‌ గాంధీ ముద్దుల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

రాహుల్‌తో పాటు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లట్‌, ఆర్‌పీసీసీ చీఫ్‌ గోవింద్‌ సింగ్‌ దోటస్రా, సచిన్‌ పైలట్‌, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. సుమారు 12 కిలోమీటర్ల యాత్ర తర్వాత దేవరిఘాటాకు చేరుకుంటుంది. మధ్యాహ్న భోజనం తర్వాత 3.30 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే యాత్ర మోరు కలాలన్‌ ఖేల్‌కు చేరుకుంటుంది.

Here's  Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement