Hugh Edmeades Health Update: వేలంలో షాక్.. కళ్లు తిరిగిపడిపోయిన ఆక్షనీర్ ఎడ్మెడేస్, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన బీసీసీఐ, మధ్యాహ్నం మూడున్నర గంటలకు వేలం ప్రారంభం
ఐపీఎల్ వేలం జరుగుతుండగా వేలం నిర్వహించే అధికారి Hugh Edmeades కళ్లు తిరిగి కిందపడిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతానికి అతనికి ఏమి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిడ్డింగ్ రూ. 3.30కు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది.
ఐపీఎల్ వేలం జరుగుతుండగా వేలం నిర్వహించే అధికారి Hugh Edmeades కళ్లు తిరిగి కిందపడిపోయిన సంగతి విదితమే. ప్రస్తుతానికి అతనికి ఏమి ప్రమాదం లేదని అధికారులు తెలిపారు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని బిడ్డింగ్ రూ. 3.30కు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ కోసం పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పోటీపడుతున్న సమయంలో ఆక్షనీర్ ఎడ్మెడేస్ కింద పడిపోయారు. దీంతో వెంటనే వేలం నిలిపివేశారు.
ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ ఎడ్మెడేస్ ఆరోగ్యంపై అప్‌డేట్ ఇచ్చింది. ‘‘ఆక్షనీర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. తిరిగి వేలంలో పాల్గొంటారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. క్రికెట్ ప్రజెంటర్ గౌతమ్ భీమాని సైతం ఎడ్మడేస్ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపాడు. ఆయనకు ఎటువంటి సమస్యలు లేవని పేర్కొన్నాడు. కాగా వేలం తిరిగి మధ్యాహ్నం మూడున్నర గంటలకు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.