Jasprit Bumrah Yorker Video: జస్ప్రీత్ బుమ్రా స్టన్నింగ్ యార్కర్ వీడియో ఇదిగో, బిత్తరపోయిన అలాగే చూస్తుండి పోయిన వృద్ధిమాన్ సాహా

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు​ అహ్హనించాడు.

Jasprit Bumrah Yorker Video

ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రా అద్బుతమైన యార్కర్‌ వీడియో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహాను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత గుజరాత్ టైటాన్స్‌ను బ్యాటింగ్‌కు​ అహ్హనించాడు. గుజరాత్-ముంబై మ్యాచులో తన్నుకున్న అభిమానులు, ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్న వీడియో వైరల్

మొదటి 3 ఓవర్లలో గుజరాత్ ఓపెనర్లు సాహా, గిల్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్‌.. బుమ్రాను ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు.గుజరాత్ ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో బుమ్రా ఆఖరి బంతిని షాకు అద్భుతమైన యార్కర్‌గా సంధించాడు.బుమ్రా వేసిన బంతికి షా దగ్గర సమాధానమే లేకుండా పోయింది. బంతిని అడ్డుకునే లోపే స్టంప్స్‌ను గిరాటేసింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)