Rohit Sharma: రికార్డులు బద్దలు కొట్టిన రోహిత్ శర్మ, టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా సెయింట్ లూసియా వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఈ సూపర్-8 మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా హిట్‌మ్యాన్ చెలరేగాడు. కేవలం 19 బంతుల్లోనే 50 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఈ టీ20 వరల్డ్ కప్ లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ సాధించి రికార్డు పుటల్లో చోటు సంపాదించుకున్నాడు. తద్వారా, అమెరికా ఆటగాడు ఆరోన్ జోన్స్ ను రోహిత్ శర్మ వెనక్కి నెట్టాడు. ఆరోన్ జోన్స్... 22 బంతుల్లోనే ఫిఫ్టీ సాధించడం తెలిసిందే. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది. ఇవాళ రోహిత్ శర్మ ధాటికి ఆసీస్ ప్రధాన పేసర్ మిచెల్ స్టార్క్ బలయ్యాడు. స్టార్క్ విసిరిన ఒక ఓవర్లో రోహిత్ శర్మ ఏకంగా 4 సిక్సులు, 1 ఫోర్ బాదడం విశేషం.అలాగే టీ20ల్లో 200 సిక్సర్లు పూర్తి చేశాడు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
World Sleep Day: భారతదేశంలో సగం మందికి నిద్ర కరువు, రోజుకు 4 గంటలు కూడా నిద్రపోలేకపోతున్నామని ఆవేదన
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement