Virat Kohli: నీవు దానికి తప్ప ఎందుకు పనికిరావు, కోహ్లీపై విరుచుకుపడుతున్న నెటిజన్లు, ఇక అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్ అంటూ ఘాటుగా ట్వీట్లు
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం అయిన సంగతి విదితమే. ఆ నేపథ్యంలోనే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసిన కోహ్లి.నెటజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం కోహ్లి ట్విటర్ వేదికగా హెల్త్ సప్లిమెంట్ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్ షేర్ చేశాడు
ఇంగ్లండ్‌తో మూడో వన్డేలోనూ కోహ్లి మరోసారి విఫలం అయిన సంగతి విదితమే. ఆ నేపథ్యంలోనే ఓ యాడ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేసిన కోహ్లి.నెటజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. సోమవారం కోహ్లి ట్విటర్ వేదికగా హెల్త్ సప్లిమెంట్ వెల్‌మ్యాన్‌కు సంబంధించిన యాడ్ షేర్ చేశాడు. వెల్‌మ్యాన్.. ఆట మీది ఒత్తిడి తాలుకు ప్రభావం మన మీద పడనివ్వం.. అందుకు బదులుగా ఆటను మార్చుకుంటాం. నా కూపన్ కోడ్ నాన్‌స్టాప్‌తో కొనుగోలు చేస్తే స్పెషల్ ఆఫర్’’ అంటూ కోహ్లి ట్వీట్ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన నెటిజన్లు అతడిపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.
‘‘ఆట మీద పూర్తి శ్రద్ధ తగ్గిపోయింది.. నువ్వు అస్సలు పాత కోహ్లివి కానే కాదు.. నిన్ను జట్టు నుంచి తప్పించాల్సిందే. ఆటపై దృష్టి పెట్టకుండా ఇలా సోషల్ మీడియాలో ప్రొడక్ట్స్ అమ్ముకుంటున్నావు. అయినా పరుగులే చేయలేని వాడికి విటమిన్స్ తీసుకుంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఇక అడ్వర్టైజ్‌మెంట్లు చేసుకుంటూ బతికెయ్! నువ్వు ఇందుకు పనికివస్తావు! అయినా సెంచరీ చేయాలంటే ఏదైనా కూపన్ ఉందా? ముందు అది తీసుకో’’ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఫ్యాన్స్ మాత్రం ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం సరికాదని హితవు పలుకుతున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)