Virat Kohli Most Catches Record: సురేష్ రైనా రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా రికార్డు

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు.

Virat Kohli (photo-X)

చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా పంజాబ్ కింగ్స్‌తో జ‌రిగిన ఉత్కంఠ పోరులో 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం సాధించి ఐపీఎల్‌-2024లో బోణీ కొట్టింది. 177 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ 6 వికెట్లు కోల్పోయి 19.2 ఓవర్లలో ఛేదించింది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో బెయిర్ స్టో క్యాచ్‌ను అందుకున్న కోహ్లి.. టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న భార‌త క్రికెట‌ర్‌గా అరుదైన ఘ‌న‌తను త‌న పేరిట లిఖించుకున్నాడు.కోహ్లి ఇప్పటివ‌ర‌కు టీ20ల్లో 173 క్యాచ్‌లు అందుకున్నాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త మాజీ ఆట‌గాడు సురేష్ రైనా పేరిట ఉండేది. టీ20 క్రికెట్‌లో రైనా 172 క్యాచ్‌లు అందుకున్నాడు. తాజా మ్యాచ్‌తో రైనా ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు. టీ20ల్లో 100 సార్లు 50 ప్ల‌స్ ర‌న్స్, తొలి భారత క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు, తొలి స్ధానంలో కొనసాగుతున్న క్రిస్ గేల్‌

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement