PAK Cricketer Yasir Shah: ఆ క్రికెటర్ కామాంధుడు, మైన‌ర్ల‌ను రేప్ చేసి వీడియోలు తీస్తాడు, పాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై ఫిర్యాదు చేసిన యువతి, మైన‌ర్ బాలిక వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు

క్రికెట‌ర్ యాసిర్ షా స్నేహితుడు ఫ‌ర్హ‌న్ త‌న‌ను గ‌న్‌పాయింట్‌లో బెదిరించి రేప్ చేశాడ‌ని, దాన్ని వీడియో తీసిన‌ట్లు కూడా ఆ బాలిక త‌న ఎఫ్ఐఆర్‌లో తెలిపింది.

Yasir Shah (Photo Credits: Getty Images)

పాకిస్థాన్ క్రికెట‌ర్ యాసిర్ షాపై మైన‌ర్ బాలిక వేధింపుల కేసు న‌మోదు అయ్యింది. క్రికెట‌ర్ యాసిర్ షా స్నేహితుడు ఫ‌ర్హ‌న్ త‌న‌ను గ‌న్‌పాయింట్‌లో బెదిరించి రేప్ చేశాడ‌ని, దాన్ని వీడియో తీసిన‌ట్లు కూడా ఆ బాలిక త‌న ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. ఈ ఘ‌ట‌న గురించి పోలీసుల‌కు చెబితే, తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద‌ని యాసిర్ షా వార్నింగ్ ఇచ్చాడ‌ని ఆ అమ్మాయి త‌న ఫిర్యాదులో తెలిపింది. తాను ప‌లుకుబ‌డి క‌లిగిన వ్య‌క్తిని అని, త‌న‌కు పోలీసు ఆఫీస‌ర్లు తెలుసు అని యాసిర్ షా (Pakistan Cricketer Yasir Shah) బెదిరించిన‌ట్లు ఆ బాలిక చెప్పింది.

యాసిర్‌, ఫ‌ర్హ‌న్‌లు మైన‌ర్ల‌ను రేప్ చేసి వీడియోలు తీస్తార‌ని ఆ బాలిక ఎఫ్ఐఆర్‌లో తెలిపింది. ఈ ఘ‌ట‌న‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఈ ఘ‌ట‌న‌కు చెందిన స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని, నిజాలు తెలిసిన త‌ర్వాత దానిపై కామెంట్ చేస్తామ‌ని పీసీబీ చెప్పింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)