Australian Open 2023: ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సంచలనం, ఇంటిదారి పట్టిన స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్, వరుస సెట్లలో నాదల్‌కు షాకిచ్చి మూడో రౌండ్‌కు చేరుకున్న మెకెంజీ మెక్ డొనాల్డ్

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు.

Rafael Nadal (Photo-Twitter)

ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పెద్ద సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ కు చుక్కెదురైంది. టాప్ సీడ్, డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ రెండో రౌండ్ లో ఇంటిదారి పట్టాడు. బుధవారం ఉదయం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో అమెరికాకు చెందిన మెకెంజీ మెక్ డొనాల్డ్ 6–4, 6–4, 7–5తో వరుస సెట్లలో నాదల్ కు షాకిచ్చి మూడో రౌండ్ చేరుకున్నాడు. 65వ ర్యాంకర్ తో మ్యాచ్ లో నాదల్ తీవ్రంగా నిరాశ పరిచాడు. దాంతో, తీవ్ర నిరాశతో టోర్నీ నుంచి వైదొలిగాడు. నాదల్ ఓటమిని తట్టుకోలేకపోయిన అతని భార్య మరియా పెరెలో కన్నీళ్లు పెట్టుకుంది. మ్యాచ్ తర్వాత మాట్లాడిన నాదల్ తాను మానసికంగా ఇబ్బందికి గురయ్యానని చెప్పాడు. తన కెరీర్ గురించి తదుపరి నిర్ణయం తీసుకునే వయసు తనకుందని వ్యాఖ్యానించాడు.

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement