
Delhi, Feb 9: ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది న్యూజిలాండ్. ఇక వరుసగా 12వ సారి టాస్ ఓడిపోయారు రోహిత్ శర్మ(ICC Champions Trophy 2025 Final).
తుది జట్లు:
న్యూజిలాండ్ :
విల్ యంగ్, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మైకేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, విలియమ్ ఓ'రౌర్క్
భారత జట్టు :
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, KL రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి
ఇక్కడ చాలా మ్యాచ్‌లు ఆడాము, ముందుగా బ్యాటింగ్ కూడా చేశాం, బౌలింగ్ కూడా చేశాం. రెండింటినీ ఎదుర్కొన్నాం, కాబట్టి రెండింటికీ సిద్ధంగా ఉన్నాం అన్నారు రోహిత్ శర్మ. టాస్‌ను ఆలోచించకుండా బాగా ఆడడమే ముఖ్యం(ICC Champions Trophy 2025 ). మేము ఇప్పటి వరకు అదే ఆలోచనతో వచ్చాము, ఇదే రోజు కూడా అలాగే కొనసాగించాలి. న్యూజిలాండ్ ఎన్నో ఏళ్లుగా మంచి జట్టుగా ఆడుతోంది, ముఖ్యంగా ICC టోర్నమెంట్లలో. వారిని ఎదుర్కొని బాగా ఆడడం మనకు సవాలు. అదే లక్ష్యంగా మేము సిద్ధమవుతున్నాం. జట్టులో ఎటువంటి మార్పులు లేవు అని తెలిపాడు రోహిత్.
ముందుగా బ్యాటింగ్ చేస్తాము. పిచ్ బాగానే ఉంది, కొద్ది రోజుల క్రితం భారత్‌తో ఇక్కడ ఆడిన మైదానంతో ఇది సమానంగా కనిపిస్తోంది న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంటర్న్ తెలిపారు. పరుగులు చేయడం ముఖ్యం, తరువాత పరిస్థితులను బట్టి చూడాలి(Ind Vs NZ). ఎక్కువగా భారత అభిమానులే ఉంటారని ఊహించాం, అద్భుతమైన వాతావరణం, అద్భుతమైన గ్రౌండ్ అన్నారు.
newzealand won the toss opt to bat, ICC Champions Trophy 2025 Final
🚨 Toss News 🚨
New Zealand have elected to bat against #TeamIndia in the #ChampionsTrophy #Final!
Updates ▶️ https://t.co/uCIvPtzs19#INDvNZ pic.twitter.com/pOpMWIZhpj
— BCCI (@BCCI) March 9, 2025
ఇక్కడ పాకిస్తాన్‌లో ఉన్న కండిషన్ల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. భారత జట్టు ఇక్కడ ఎలా ఆడిందో మేము గమనించాం. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించవచ్చు. జట్టులో ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో తమ వంతు కృషి చేశారు. తొలినుంచే మంచి ఆటతీరు కనబరచాలని కోరుకుంటున్నాం. మేం ఇప్పటికే మంచి ఆరంభం అందుకున్నాం, అలాగే భారత్ కూడా. దురదృష్టవశాత్తూ మాట్ హెన్రీ గాయపడినందున, నాథన్ స్మిత్ జట్టులోకి వచ్చాడు అని తెలిపాడు.