Andhra Pradesh: విద్యాశాఖపై సీఎం జగన్ సమీక్ష, టీచర్లకు,8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై సీఎం కీలక ఆదేశాలు

పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఈ సమావేశంలో సీఎం అధికారులతో సమీక్ష జరిపారు.

CM YS Jagan (Photo-Twitter/AP CMO)

పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. టీచర్లకు, 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీపై ఈ సమావేశంలో సీఎం అధికారులతో సమీక్ష జరిపారు. 5,18,740 ట్యాబ్‌లను కొనుగోలు చేయనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. ట్యాబ్‌ల్లో బైజూస్‌ కంటెంట్‌ ఇవ్వనున్నారు. తరగతి గదులను డిజిటలీకరణ చేసే కార్యక్రమంలో భాగంగా స్మార్ట్‌ టీవీలను,ఇంటరాక్టివ్‌ టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.అన్ని స్కూళ్లలో ఇంటర్నెట్‌ సదుపాయం ఉండేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. డిజిటల్‌ లైబ్రరీలు సహా గ్రామ సచివాలయం, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్‌ అన్నింట్లో కూడా ఇంటర్నెట్‌ సదుపాయం ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement