Andhra Pradesh Elections 2024: నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము, వీడియో ఇదిగో, జనసేనాధినేతకు షాకిస్తున్న SVSN Verma అనుచరులు

ఈ వీడియోలో Srivatsavai Satyanarayana Varma వర్మ అనుచరులు నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము అని చెప్పారు. కాగా వర్మ ఇంటర్నల్ సమావేశంలో వర్మ తో టీడీపీ కార్య కర్తలు ఈ మాటలు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

SVSN Verma and Pawan Kalyan (photo-X)

ఏపీలో భానుడు భగభగల మధ్య ఎన్నికల వేడి కూడా హాట్ హాట్ గా ఉంది. ఈ సారి అందరి కన్ను పిఠాపురం రాజకీయాలపైనే ఉంది. అక్కడి నుంచి కూటమి నుంచి జనసేనాధి నేత పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ప్రచార పర్వం ఊపందుకుంది. పవన్ కళ్యాణ్ కు ఇప్పటికే చిరంజీవి మద్ధతు ప్రకటించగా హీరో నాని కూడా తన మద్దతు తెలియజేశారు.

ఇక జబర్దస్ట్ కమెడినట్లు అంతా అక్కడ ప్రచారం నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో Srivatsavai Satyanarayana Varma వర్మ అనుచరులు నువ్వు నిలబడితే నీకు ఓటు వేస్తాం కానీ పవన్ కి వెయ్యము అని చెప్పారు. కాగా వర్మ ఇంటర్నల్ సమావేశంలో వర్మ తో టీడీపీ కార్య కర్తలు ఈ మాటలు అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  మా తమ్ముడిని పిఠాపురంలో గెలిపించండి, వీడియో విడుదల చేసిన చిరంజీవి, జనసేనాని గురించి ఇంకా ఏమన్నారంటే..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)