Andhra Pradesh: పొలం నుంచి వస్తుండగా రైతును తొక్కి చంపిన ఏనుగు, మన్యం జిల్లాలో విషాదకర ఘటన వీడియో ఇదిగో..
ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు.
మన్యం జిల్లా కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓ వృద్ధుడిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. స్థానిక వాగులో స్నానం చేసిన శివుడినాయుడు (62) తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అరటితోటలో ఏనుగుల గుంపు ఉన్నట్లు అతడు గమనించలేదు. తన దారిలో వెళ్లిపోతుండగా.. ఏనుగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాయి. అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో ఏనుగుల దాడులు తరచూ జరుగుతున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.ఇటీవలే ఈ ఏనుగుల గుంపును తరమడానికి కుంకీ ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. షాకింగ్ వీడియో ఇదిగో, లైవ్‌లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రేమికులు, పశ్చిమగోదావరి జిల్లాలో విషాదకర ఘటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)