Corona in AP: ఏపీలో కొత్తగా 122 మందికి కరోనా, గత రెండు రోజుల నుంచి మరణాలు నిల్
ఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.
ఏపీలో గడచిన 24 గంటల్లో 13,460 కరోనా పరీక్షలు నిర్వహించగా, 122 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 23, గుంటూరు జిల్లాలో 18, అనంతపురం జిల్లాలో 16, తూర్పు గోదావరి జిల్లాలో 15 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో కొత్త కేసులేవీ నమోదు కాలేదు. అంతేకాకుండా వరుసగా రెండో రోజు కూడా రాష్ట్రంలో కరోనాతో గురువారం నాడు మరణాలేమీ సంభవించలేదు.
అదే సమయంలో 236 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,18,176 మంది కరోనా బారిన పడగా, వారిలో 23,01,904 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,543 మంది చికిత్స పొందుతున్నారు. గడచిన రెండు రోజులుగా రాష్ట్రంలో కరోనా కారణంగా మరణాలేమీ లేకపోవడంతో కరోనాతో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 14,729గానే ఉంది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement