Corona in AP: ఏపీలో గత 24 గంటల్లో 166 మందికి కరోనా, చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మందికి కోవిడ్

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి కరోనా సోకింది. గుంటూరు, కృష్ణాలలో ఒక్కొక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసులకు గాను…20,58,601 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో 31 వేల 844 శాంపిల్స్ పరీక్షించగా 166 మందికి కరోనా సోకింది. గుంటూరు, కృష్ణాలలో ఒక్కొక్కరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదైన మొత్తం 20,74,250 పాజిటివ్ కేసులకు గాను…20,58,601 మంది డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. 14,495 మంది చనిపోయారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారి సంఖ్య 1,154గా ఉందని తెలిపింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 28 మంది వైరస్ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల్లో 91 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని…ఆరోగ్యవంతులయ్యారని తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 3,13,27,1317 శాంపిల్స్ పరీక్షించడం జరిగిందని పేర్కొంది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 12. చిత్తూరు 28. ఈస్ట్ గోదావరి 10. గుంటూరు 10. వైఎస్ఆర్ కడప 03. కృష్ణా 21. కర్నూలు 09. నెల్లూరు 13. ప్రకాశం 06. శ్రీకాకుళం 03. విశాఖపట్టణం 31. విజయనగరం 08. వెస్ట్ గోదావరి 12. మొత్తం : 166

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement