Corona in AP: ఏపీలో గత 22 గంటల్లో 14,502 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కేసులు, కడప జిల్లాలో 1,492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,198 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus test (Photo-ANI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 40,266 శాంపిల్స్ పరీక్షించగా 14,502 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,728 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,610 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,597 కేసులు, కర్నూలు జిల్లాలో 1,551 కేసులు, కడప జిల్లాలో 1,492 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,198 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 4,800 మంది కరోనా నుంచి కోలుకోగా, ఏడుగురు మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,549కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 21,95,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,87,282 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 93,305 మంది చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement