Tirupathi: తిరుపతి స్విమ్స్‌ ఆస్పత్రిలో దారుణం, మహిళా డాక్టర్‌పై రోగి దాడి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కొట్టిన రోగి, సీసీటీవీలో రికార్డు అయిన దృశ్యాలు

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.

Andhra Pradesh Tirupathi Patient Attacks Woman Doctor at SVIMS Hospital(Photo Credit X @DrDhruvchauhan)

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి స్విమ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఓ డాక్టర్‌ జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి ఆసుపత్రి మంచానికి ఉండే స్టీల్ ఫ్రేమ్‌కేసి ఆమె తలను బాదాడు ఓ రోగి. వెంటనే స్పందించిన సహచర డాక్టర్లు ఆ రోగి బారి నుండి బాధిత డాక్టర్‌ను కాపాడారు.

ఎమర్జెన్సీ వార్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. విధుల్లో ఉన్న ఓ మహిళా డాక్టర్‌పై రోగి బంగార్రాజు ఒక్కసారిగా వెనక నుంచి దాడిచేశాడు. ఈ ఘటనకు సంబంధించి ఫిర్యాదు చేశారు బాధిత డాక్టర్. నిందితుడి చేతిలో కనుక ఆయుధం ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని బాధిత డాక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వీడియో ఇదిగో, మురికి నీటిలో కడుగుతున్న అన్న క్యాంటీన్ ప్లేట్లు, తణుకులో వెలుగులోకి వచ్చిన ఘటన

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement