AP CID SP Radhika: మానవబాంబుగా మారి సీఎం జగన్‌ను చంపుతానంటూ పోస్ట్, నిందితుడిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక
సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు. మానవబాంబుగా మారి సీఎంను హతమార్చుతానని అతను ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు.
సీఎంను చంపుతానంటూ రాజుపాలెపు ఫణి అనే జనసేన మద్దతుదారుడు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని అతన్ని అరెస్ట్ చేశామని ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక తెలిపారు. మానవబాంబుగా మారి సీఎంను హతమార్చుతానని అతను ట్విట్టర్ లో పోస్టు చేశాడని, తర్వాత ఆ పోస్టును డిలీట్ చేశాడని ఎస్పీ రాధిక వివరించారు. సీఎంపై బెదిరింపులకు పాల్పడిన ఆ జనసేన మద్దతుదారుడు తన అసలు పేరుకు బదులు కన్నా భాయ్ అనే అకౌంట్ ద్వారా పోస్టులు చేశాడని ఆమె వివరించారు.
అనంతరం ఫోన్ స్విచాఫ్ చేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని తెలిపారు. టెక్నాలజీ సాయంతో ఫణిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. చట్టవిరుద్ధంగా పోస్టులు పెట్టేవారిపై చర్యలు ఉంటాయని ఎస్పీ రాధిక స్పష్టం చేశారు. విచారణలో పవన్ అభిమానినని, జనసేన మద్దతుదారుడినని ఫణి చెప్పాడని వివరించారు. ఈ మేరకు ఏపీ సీఐడీ సైబర్ క్రైమ్ ఎస్పీ రాధిక గుంటూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.