Buddha Venkanna Challenge Video: అప్పుడు తొడ గొట్టాడు, ఇప్పుడు నాలుక కోసుకుంటానంటున్నాడు, ఆరా మస్తాన్ సర్వే నిజమైతే బుద్ధా నాలుక కోసుకుంటాడా..

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఆరా మస్తాన్ సర్వేపై నాలుక కోసుకుంటానంటూ సవాల్ విసిరారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

AARAA Vs Budda Venkanna

మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తాజాగా ఆరా మస్తాన్ సర్వేపై నాలుక కోసుకుంటానంటూ సవాల్ విసిరారు. విజయవాడ టిడిపి పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైయస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే.. నా నాలుక కోసుకుంటా. కూటమి అధికారంలోకి వస్తే ఆరా మస్తాన్ నాలిక కోసుకోవడానికి సిద్ధమా?" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.  అధికార వైసీపీకే జైకొట్టిన ఆరామస్తాన్ సర్వే, 98 నుంచి 116 సీట్లతో జగన్ మళ్లీ అధికారంలోకి, 59 నుంచి 77 సీట్ల మధ్యలో టీడీపీ

ఇక గతంలో (2019) రెండోసారి కూడా వరుసగా టిడిపి అధికారంలోకి వస్తుందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న తొడగొట్టి దీమాగా చెప్పారు. ఓట్ల లెక్కింపులో వైయస్ఆర్సీపీకి ఊహించని విధంగా 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్ధా వెంకన్న పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం తగ్గకూడదని తొడగొట్టినట్లు మీడియాకు చమత్కారంగా వివరణ ఇవ్వడం గమనార్హం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now