Vijayawada Bypass Accident: వీడియో ఇదిగో.. విజయవాడ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో చిక్కుకుని నలుగురు సజీవ దహనం..

Vijayawada Bypass Accident

Vijayawada Bypass Accident: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఒక ఎలక్ట్రిక్ కారు (EV) అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటనలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కారు ఢీకొట్టిన మరుక్షణమే ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ఘోర అగ్నిప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవదహనమయ్యారు.

నంబూరులో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద గమనించి అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టగా, తీవ్ర గాయాలపాలైన మరో బాధితుడిని అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని నున్న, నంబూరు గ్రామాల వాసులుగా గుర్తించారు. మృతులలో నున్న ప్రాంతానికి చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణ, ఒక చిన్నారితో పాటు నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి అసలు కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

Vijayawada Bypass Accident Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement