Hyderabad Shocker: వీడియో ఇదిగో, మద్యం మత్తులో స్నేహితులు రెచ్చగొట్టడంతో ఈత రాకపోయినా నదిలో దూకిన యువకుడు, మునిగిపోతుంటే ఇంకా రెచ్చగొడుతూ..
హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన స్నేహితులు కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లారు. కర్నాటలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో టూర్‌కు వెళ్లిన వీళ్లు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కొందరు స్నేహితులు నదిలో ఈతకు దిగారు.
హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణ గుట్ట బండ్లగూడ ప్రాంతానికి చెందిన స్నేహితులు కర్ణాటకలో విహారయాత్రకు వెళ్లారు. కర్నాటలోని కమలాపూర్ చెడుగుప్ప ప్రాంతంలో టూర్‌కు వెళ్లిన వీళ్లు ఫుల్‌గా మద్యం తాగారు. తర్వాత కొందరు స్నేహితులు నదిలో ఈతకు దిగారు. ఇంకో స్నేహితుడు షాజీద్ మాత్రం మద్యం మత్తులో తూగుతూ రోడ్డపై నిల్చున్నాడు. షాజీద్‌ను ఇంకో ఫ్రెండ్ రెచ్చగొట్టాడు. ఈతకు వెళ్లాలని అంటూ పదే పదే అన్నాడు. అప్పటికే మద్యం తాగి ఒంటిపై స్పృహలేకుండా ఉన్న షాజీద్ స్నేహితుడు చెబుతున్న మాటలకు మరింత భావోద్వేగానికి గురై నదిలో దూకేశాడు. వీడియో ఇదిగో, మద్యం లారీ బోల్తా, మందుబాటిళ్లను తీసుకునేందుకు ఎగబడిన జనాలు, బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
అంతే నదిలో మునుగుతూ తేలుతున్న షాజీద్ పరిస్థితి తెలుసుకోలేకపోయిన ఒడ్డున్న మరో స్నేహితుడు మరింతగా రెచ్చగొట్టాడు. ఈదాలి అంటూ పక్కనే ఫ్రెండ్ వద్దకు వెళ్లాలని అన్నాడు. ఆ ప్రయత్నంలోనే అందరూ చూస్తుండగానే నదిలో మునిగిపోయాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్నేహితుడు అప్పుడు మేల్కొని షాజీద్‌ను రక్షించాలంటూ వేడుకోవడం మొదలు పెట్టాడు. ఆ దారిలో వెళ్తున్న వారిని బతిమలాడి లోతుగా వెళ్లి వెతకాలని ప్రాధేయపడ్డాడు. కానీ అప్పటికే షాజీద్ మృతి చెందాడు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)